వెల్దండ, సెప్టెంబరు 24 (చైతన్యగళం): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వెల్దండ మండల కేంద్రంలోని గణపతి మండపాల వద్ద గురువారం రాత్రి లడ్డూ వేలం పాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, భక్తులు ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్న రేవల్లి దర్గయ్యను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. గణనాథుడి ఆశీస్సులు లభించాలని కోరుతూ ప్రసాదాన్ని అందజేశారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ బస్నమోని శీను, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, మండల గౌడ సంఘం అధ్యక్షుడు మదన్‌గౌడ్, గ్రామ పెద్దలు మట్ట కృష్ణయ్య, మండల యువజన అధ్యక్షుడు భరత్‌గౌడ్, వార్డు సభ్యుడు పురుషోత్తం, యువజన సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
