లడ్డూ గ్రహీతకు సన్మానం.. భక్తులకు ప్రసాదం అందజేత

వెల్దండ, సెప్టెంబరు 24 (చైతన్యగళం‌): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వెల్దండ మండల కేంద్రంలోని గణపతి మండపాల వద్ద గురువారం రాత్రి లడ్డూ వేలం పాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, భక్తులు ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్‌ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్న రేవల్లి దర్గయ్యను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. గణనాథుడి ఆశీస్సులు లభించాలని కోరుతూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో...