- పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు
హుస్నాబాద్, సెప్టెంబరు 23 (చైతన్యగళం): గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు గణేష్ మండపాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సందర్శించారు. ఆర్టీసీ బస్ డిపో కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని దర్శించుకున్నారు.
అనంతరం హనుమాన్‌నగర్‌లో బొలిశెట్టి శివయ్య నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
