Wednesday, October 14, 2026
Homeతెలంగాణఎమ్మెల్యే నాగరాజు విజన్‌పై విమర్శలు హాస్యాస్పదం -నకరకంటి మోహన్ గౌడ్

ఎమ్మెల్యే నాగరాజు విజన్‌పై విమర్శలు హాస్యాస్పదం -నకరకంటి మోహన్ గౌడ్

📰 Generate e-Paper Clip

  • 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే అభివృద్ధికి నిదర్శనం..
  • గత పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా?

వర్ధన్నపేట ప్రతినిధి , అక్టోబర్ 13 (చైతన్యగళం):
ప్రజల సంక్షేమం,అభివృద్ధి, పేదలకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వానికి కొలమానమని, కేవలం విమర్శలు చేయడం, రాజకీయ ఆరోపణలు గుప్పించడమే విజన్‌కు నిర్వచనం కాదని ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు విజన్ లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.ఎమ్మెల్యే నాగరాజు పనితీరును విమర్శించే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకొచ్చిన నిధులు, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాల వివరాలను ప్రజల ముందుంచాలని మోహన్ గౌడ్ సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని పేర్కొన్నారు.

విజన్ అంటే మాటలు కాదు.. ప్రజల జీవితాల్లో మార్పు

పేదలకు సంక్షేమ పథకాలు అందించడం, అర్హులకు ప్రభుత్వ ఫలాలు చేరేలా చూడడం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యమివ్వడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం విజన్ కాదా? అని మోహన్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేశారు? ఎన్ని నిధులు తీసుకొచ్చారు? అనే అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

దైవభక్తికి ఆర్భాటాలు కొలమానం కాదు

ఎమ్మెల్యే నాగరాజుకు దైవభక్తి లేదంటూ చేస్తున్న విమర్శలను కూడా ఆయన ఖండించారు. దేవుడి సన్నిధిలో భక్తులందరూ సమానమేనని, ఆలయాల్లో ఆర్భాటాల కంటే భక్తి పట్ల గౌరవం, సేవాభావం, సమానత్వం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి భక్తుడికి సమాన అవకాశం కల్పించడమే నిజమైన ధార్మిక దృక్పథమని అన్నారు.

అభివృద్ధిపై చర్చకు రావాలి

రాజకీయాల్లో విమర్శలు సహజమని, అయితే వ్యక్తిగత ఆరోపణల కంటే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ జరగాలని మోహన్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తారని, ఎన్నికల్లో అంతిమ తీర్పు ఇచ్చే అధికారం ప్రజలకే ఉందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!