గణేష్‌ మండపాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు

పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు హుస్నాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్‌ పట్టణంలోని పలు గణేష్‌ మండపాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం సందర్శించారు. ఆర్టీసీ బస్‌ డిపో కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం హనుమాన్‌నగర్‌లో బొలిశెట్టి శివయ్య నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు...