Monday, September 21, 2026
Homeతెలంగాణఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు

ఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ కోసం పదవిని త్యజించిన కొండా లక్ష్మణ్ బాపూజీ

 

హుస్నాబాద్సె,ప్టెంబర్ 21(చైతన్యగళం):

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలను హుస్నాబాద్ పట్టణ, మండల చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కండేయ దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం వదులుకుని ఉద్యమానికి అంకితమైన వ్యక్తిగా బాపూజీ చరిత్రలో నిలిచిపోయారని నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన రాజకీయ పదవిని త్యజించి పోరాటం కొనసాగించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పద్మశాలి, చేనేత వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ చేనేత రంగం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో హుస్నాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షుడు బూర్ల రాజయ్య, పట్టణ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొండ సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ కొండ రజిత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ, మహిళా విభాగం అధ్యక్షురాలు పంతం కన్యాకుమారి, వడ్డేపల్లి అరుణ, గోలి వెంకటనారాయణ, వడ్డేపల్లి లక్ష్మయ్య, వెల్దండి భాస్కర్, కోమటి నారాయణ, కొండి గణపతి, చిదురాల స్వరూపతో పాటు చేనేత కార్మిక సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!