Monday, September 21, 2026
Homeతెలంగాణమట్టి గణపతినే పూజిద్దాం

మట్టి గణపతినే పూజిద్దాం

📰 Generate e-Paper Clip

  • పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డా. నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని పలు అవార్డుల గ్రహీత డా. నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్‌ సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలమూరు బ్రహ్మానవాడి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.

రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, కృత్రిమ రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోతాయని తెలిపారు. భవిష్యత్తులో ఇంటి వద్దనే నిమజ్జనం చేసుకునేలా మట్టి గణపతి ప్రతిమలను ప్రోత్సహించాలని కోరారు.

వినాయక అష్టోత్తర నామావళి, పూజా విశిష్టతను భక్తులకు వివరించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!