- ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
- ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన కేటీఆర్
వెల్దండ, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను శాలువాతో సన్మానించారు.
అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత సింగం విజయ్‌గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పాటను కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. పాటను వీక్షించిన కేటీఆర్.. ఇది మంచి ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీలు గోవర్ధన్, అనిల్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ ఎంపీటీసీ నాగులు నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, తలకొండపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, సర్పంచ్ జల్లెల్ల కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.
