Saturday, September 5, 2026
Homeతెలంగాణకరీంనగర్ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల పాలన విజయోత్సవ బైక్ ర్యాలీ

ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల పాలన విజయోత్సవ బైక్ ర్యాలీ

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 4 (చైతన్యగళం):

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తూ, పరిపాలనపై పట్టు సాధించి, సహచర మంత్రులతో సమన్వయంతో ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రగతిని సాధిస్తోందని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు.

కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ బైక్ ర్యాలీ ఇందిరా చౌక్ నుంచి ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌక్, మహాత్మా గాంధీ చౌక్, బాబు జగ్జీవన్ రామ్ చౌక్ మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆకుల నర్సయ్య, కరీంనగర్ సిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్, మడుపు మోహన్ చారి, ఆకారపు భాస్కర్ రెడ్డి, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!