వేడుకలకు భిన్నంగా.. మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిన అలయన్స్ క్లబ్
కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137-ఏ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1,200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖుల పుట్టినరోజులను పురస్కరించుకుని చేపట్టారు. ఆగస్టు 24న ఇంజనీర్ కోల అన్నారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటగా, ఆగస్టు 25న బి. తిరుపతి రాజు, 26న శాస్త్రి, 27న జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, 30న చెరిమాల వెంకటేశ్వర్లు...