పెద్దపల్లి, ఆగస్టు 27 (చైతన్యగళం):
గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకురాళ్లు, కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రవీందర్‌కు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు.
“నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనిద్దరం దేశానికి రక్ష” అనే నినాదంతో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థినీ, విద్యార్థులు కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యాపకురాలు శారద మాట్లాడుతూ.. రక్షాబంధన్ అనేది రక్షణ బంధానికి ప్రతీక అని అన్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్రమైన అనుబంధాన్ని చాటిచెప్పే పండుగగా రక్షాబంధన్‌ను జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులు పరస్పరం ప్రేమ, ఆప్యాయత, సోదరభావంతో మెలగాలని సూచించారు.
కార్యక్రమంలో అధ్యాపకురాళ్లు శారద, ఆమని, రవళి, శ్రీవిద్య, సరస్వతి, లీనా, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
