Thursday, August 6, 2026
Homeతెలంగాణకరీంనగర్నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్య గళం):

నిర్వహణ పనుల కారణంగా కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. టౌన్-8 సెక్షన్ పరిధిలో లైన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాషా మహల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ పి. శ్రీనివాస్ తెలిపారు. అలాగే 11 కేవీ ఇండస్ట్రియల్ ఫీడర్‌పై నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇండస్ట్రియల్ ఏరియా, మానేర్ నగర్, పద్మనగర్, ప్రగతి నగర్, లారెల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని సహించి విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!