Thursday, August 6, 2026
Homeతెలంగాణకరీంనగర్నామినేటెడ్ పోస్టుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం- రోషిణి జైశ్వాల్

నామినేటెడ్ పోస్టుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం- రోషిణి జైశ్వాల్

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్యగళం):

యూత్ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, త్వరలో భర్తీ చేసే నామినేట్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని రోషిణి జైశ్వాల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి, త్యాగానికి తగిన గుర్తింపు లభించేలా నామినేట్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞ థామస్, జిల్లా ఇన్‌చార్జి తేజస్విని జోసెఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం వాసు, అసెంబ్లీ అధ్యక్షుడు అట్లా అనిల్, నగర అధ్యక్షుడు విశాల్‌తో పాటు ఫహద్, తల్లపెల్లి శ్రీకాంత్, తోర్తి అరవింద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!