నామినేటెడ్ పోస్టుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం- రోషిణి జైశ్వాల్
కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్యగళం): యూత్ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, త్వరలో భర్తీ చేసే నామినేట్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని రోషిణి జైశ్వాల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి, త్యాగానికి తగిన గుర్తింపు లభించేలా నామినేట్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు...