Monday, August 10, 2026
Homeతెలంగాణకరీంనగర్పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

గన్నేరువరం, ఆగస్టు 5 (చైతన్య గళం):

ఖాసింపేట్ గ్రామానికి చెందిన కయ్యం సంపత్‌పై పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అరెస్టు చేసినట్లు గన్నేరువరం ఎస్సై తెలిపారు. గత నెల 20న భూ వివాదానికి సంబంధించి సంపత్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. విచారణ తనకు అనుకూలంగా జరగడం లేదంటూ పోలీసులను బెదిరిస్తూ వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసినట్లు తెలిపారు. అనంతరం సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం ఆయనను కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!