Thursday, August 20, 2026
Homeఆంధ్రప్రదేశ్మానవతా దృక్పథంతో ఆదుకోవాలి

మానవతా దృక్పథంతో ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, జూలై 26 (చైతన్యగళం):
రాష్ట్రాభివృద్ధి కోసం తమ యావదాస్థిని త్యాగం చేసిన మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిందిపోయి మరణాల వైపు నడిపించడం హామిలిచ్చిన నాయకులకు తగదని ముంపు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.నందికొట్కూరు పట్టణంలో 123 రోజులుగా జీవో 98 బాధితులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుడు జయన్న మాట్లాడుతూ, “మా నిరీక్షణ ఫలించే వరకు పోరాడుతాం. తక్షణమే జీవో 98 ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలను సంఘటితం చేసి స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం” అని హెచ్చరించారు.ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు, తమ త్యాగాలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ దీక్షలో నాగేంద్ర, చిన్న సుబ్బయ్య, రామక్రిష్ణ, నాగసుంకన్న, నాగరాజు, మౌలాలి, వెంకటేశ్వర్లు, జమ్మన్న, సామేల్, జయన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!