మానవతా దృక్పథంతో ఆదుకోవాలి
నందికొట్కూరు, జూలై 26 (చైతన్యగళం): రాష్ట్రాభివృద్ధి కోసం తమ యావదాస్థిని త్యాగం చేసిన మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిందిపోయి మరణాల వైపు నడిపించడం హామిలిచ్చిన నాయకులకు తగదని ముంపు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.నందికొట్కూరు పట్టణంలో 123 రోజులుగా జీవో 98 బాధితులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుడు జయన్న మాట్లాడుతూ, “మా నిరీక్షణ ఫలించే వరకు పోరాడుతాం. తక్షణమే జీవో 98 ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలను సంఘటితం చేసి స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం”...