Thursday, August 20, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతశ్రీశైలం శైవక్షేత్రంలో భక్తుల రద్దీ

శ్రీశైలం శైవక్షేత్రంలో భక్తుల రద్దీ

📰 Generate e-Paper Clip

శ్రీశైలం, జూలై 26 (చైతన్యగళం):
ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం భక్తులు భారీగా పోటెత్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు.రద్దీ కారణంగా దర్శనానికి సుమారు నాలుగు నుండి ఐదు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం తాగునీరు, అల్పాహారం నిరంతరంగా అందించారు. ముఖ్యంగా భక్తుల రద్దీని నియంత్రించడానికి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి పోలీసు సిబ్బంది, దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తులు ఉదయాన్నే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి అలంకార దర్శనం చేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!