Tuesday, August 18, 2026
Homeతెలంగాణమర్రిగూడ జంక్షన్ లో నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మర్రిగూడ జంక్షన్ లో నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నల్లగొండ,జులై 25 (చైతన్యగళం):
నార్కట్‌పల్లి – అద్దంకి – మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నల్గొండ పట్టణవాసులతో పాటు, ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే వేలాది మంది వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అత్యంత రద్దీగా ఉండే మర్రిగూడ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజలకు సురక్షితమైన అలాగే వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ ప్రాజెక్టు ఒక ప్రత్యక్ష నిదర్శనం. రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా నల్గొండ ప్రాంత ఆర్థిక మరియు వాణిజ్య వృద్ధికి ఈ నూతన ఫ్లైఓవర్ రహదారిని సుగమం చేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమం పట్ల ప్రాంతీయ ప్రజలు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్య క్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!