మర్రిగూడ జంక్షన్ లో నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ,జులై 25 (చైతన్యగళం): నార్కట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నల్గొండ పట్టణవాసులతో పాటు, ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే వేలాది మంది వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అత్యంత రద్దీగా ఉండే మర్రిగూడ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజలకు సురక్షితమైన అలాగే వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి...