Thursday, August 20, 2026
Homeతెలంగాణచర్లపల్లి చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

చర్లపల్లి చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

నల్లగొండ, జూలై 25 (చైతన్యగళం)‌:
నల్గొండ పట్టణ పరిధిలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “చేనేత కళ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, మన అస్తిత్వానికి ప్రాణవాయువు లాంటిది. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి నేసే అద్భుతమైన వస్త్రాలు మన రాష్ట్రానికి దేశస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి” అని అన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమం, వారి జీవనోపాధి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సహకార సంఘాలు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ పథకాలు సక్రమంగా కార్మికులకు చేరేలా చూడాలని సూచించారు.

చేనేత రంగ అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, యువతను చేనేత రంగం వైపు ఆకర్షించే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.

నూతన పాలకవర్గం సమష్టి కృషితో చర్లపల్లి చేనేత సహకార సంఘం మరింత అభివృద్ధి సాధించి, కార్మికులకు ఆదర్శంగా నిలవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!