Monday, July 20, 2026
Homeతెలంగాణఆరుట్లలో సిసి రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

ఆరుట్లలో సిసి రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

ఇబ్రహింపట్నం, జూలై 19 (చైతన్యగళం): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా ప్రత్యేక నిధుల ద్వారా ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో మంజూరైన నిధులతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.గ్రామ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇబ్రహింపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, మాజీ ఎంపిటిసి లాలగారి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మార సురేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుట్టి కృష్ణ, కంబాలపల్లి బుగ్గరాములు, కోరె బాబు, కాంగ్రెస్ నాయకులు లచ్చగారి జంగారెడ్డి, పంబాల కిషోర్, ఎండి అశ్రఫ్, ఆర్ల బీరుమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!