Monday, July 20, 2026
Homeతెలంగాణదళితులకు రక్షణ కల్పించండి

దళితులకు రక్షణ కల్పించండి

📰 Generate e-Paper Clip

  • ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఆల్ సంఘాల ఐక్యవేదిక విన్నపం

పెద్దపల్లి,జూన్ 18(చైతన్య గళం): పెద్దపల్లి జిల్లాలో దళితులపై పెరుగుతున్న దాడులు,భూకబ్జాలు,సామాజిక వివక్ష, అధికారుల నిర్లక్ష్యంపై ఆల్ సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాటకుల మహేష్ నాయకత్వంలో బాధితులు మరియు సంఘాల ముఖ్య నాయకులు శనివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి,సమగ్ర వినతి పత్రంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.జిల్లాలో చోటుచేసుకుంటున్న ఆలయ ప్రవేశ నిషేధాలు,కుల బహిష్కరణలు,భూ సమస్యలు,
దళితులపై జరుగుతున్న హత్యల వంటి తీవ్రమైన అంశాల పట్ల స్థానిక పోలీస్ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని,దీనివల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల తరఫున వాదనలు వినిపిస్తూ,వెంటనే ఈ సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని,బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష లకు వినతి పత్రం అందజేసి కోరారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు,ఆది జాంబవంతు అరుంధతి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి పాపయ్య,మాజీ ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి,గుల్ల రాజు,కవ్వంపల్లి దుర్గయ్య, బొంకూరి సుభాష్,సలగంటి రామలక్ష్మి, ఉండింటి ప్రభాకర్,రామిల్ల శారద,బోసేల్లి మహేష్,కృష్ణ,వీరయ్య,శంకరయ్య,మల్లేశం,బోధలు,మదెల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!