గంగాధర, జూలై 19 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి చెందిన నిరుపేద కుటుంబ యువకుడు ఊరడి సాయికుమార్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే మధురానగర్ వాలీబాల్ సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.
సంఘం సభ్యులు కలసి రూ.16,000 ఆర్థిక సహాయం అందజేసి సాయికుమార్ కుటుంబానికి తోడుగా నిలిచారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి, సాయికుమార్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ సంఘటనతో గ్రామ ప్రజలు వాలీబాల్ టీమ్ సభ్యుల సేవాభావాన్ని ప్రశంసించారు.
