నందికొట్కూరు, జూలై 18 (చైతన్యగళం):
నందికొట్కూరు మండల పరిధిలోని శాతనం కోట గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కూలీలను తరలిస్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు కేసు కెనాల్‌లో పడిపోయింది.

అల్లూరు గ్రామానికి చెందిన AP 21 TB 1463 నంబర్ వాహనంలో అదే గ్రామానికి చెందిన 15 మంది కూలీలు పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా కూలీలకు కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం గాయపడిన కూలీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది.
