నందికొట్కూరు మండలంలో బొలెరో ప్రమాదం – 15 మంది కూలీలకు గాయాలు
నందికొట్కూరు, జూలై 18 (చైతన్యగళం): నందికొట్కూరు మండల పరిధిలోని శాతనం కోట గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కూలీలను తరలిస్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు కేసు కెనాల్‌లో పడిపోయింది. అల్లూరు గ్రామానికి చెందిన AP 21 TB 1463 నంబర్ వాహనంలో అదే గ్రామానికి చెందిన 15 మంది కూలీలు పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా కూలీలకు కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే...