CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 2:47 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రేపు కాపువాడ ఫీడర్‌పై విద్యుత్ అంతరాయం

కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం): రేపు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు 11KV కాపువాడ ఫీడర్పై లైన్ నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

ఈ సందర్భంగా ఏడీఈ (టౌన్–1) పి. శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు కాపువాడ, మారుతీనగర్ చౌరస్తా, అశోక్‌నగర్, అహ్మద్‌పురా, పాత బజార్, మంగలి వాడ, శివాలయం, బొమ్మకల్ చౌరస్తా అని పేర్కొన్నారు.

వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.