సుల్తానాబాద్ (చైతన్యగళం): బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకుడు కూరపాటి రవిచందర్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, పెద్దపల్లి అభివృద్ధి పథంలో తన వంతు పాత్ర పోషించాలని, ఉన్నత పదవులు శిఖరాలకు చేరుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మేకల కిట్టు యాదవ్, లింగంపల్లి రాజేశ్వరరావు, గరిగంటి రాజు, కూరపాటి రామకృష్ణ, యువకులు తదితరులు పాల్గొన్నారు.
