Wednesday, July 8, 2026
Homeతెలంగాణయరగండ్లపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరం

యరగండ్లపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, జూలై 7 (చైతన్యగళం): ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.సర్పంచ్ సంతోష్ యాదవ్ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, పేద–మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా సరైన చికిత్స పొందలేకపోతున్నారని గుర్తించి, కామినేని ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. వందలాది మంది గ్రామస్తులు రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. వైద్యులు అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి, మెరుగైన వైద్య సలహాలు అందించారు.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతి ఏర్పాటును చూసుకున్నారు. ఆయన చొరవను ప్రజలు అభినందిస్తూ, “పదవి కోసం కాకుండా ప్రజల కోసం పని చేసే నాయకుడు మాకు దొరకడం అదృష్టం” అని ప్రశంసించారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.సర్పంచ్ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ, “ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా, మౌలిక సదుపాయాలు అందించడమే నా లక్ష్యం. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు తోడుగా ఉంటాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!