యరగండ్లపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరం
మర్రిగూడ, జూలై 7 (చైతన్యగళం): ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.సర్పంచ్ సంతోష్ యాదవ్ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, పేద–మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా సరైన చికిత్స పొందలేకపోతున్నారని గుర్తించి, కామినేని ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. వందలాది మంది గ్రామస్తులు రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. వైద్యులు అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి, మెరుగైన...