Thursday, September 10, 2026
Homeతెలంగాణరోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్,జూలై 2 (చైతన్యగళం):
రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు దూదికట్ల సత్యం అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడారు. మానవాళి మనుగడకు వైద్యుల సేవలు జీవనాధారం. అలాంటి మహనీయులను సత్కరించడం రోటరీకి గౌరవం” అని అన్నారు. రోటరీ క్లబ్ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, వికలాంగుల సంక్షేమం, ప్రపంచ శాంతి వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందిస్తామని తెలిపారు.

అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ వెనిగాళ్ల జగన్మోహన్ రావు, డాక్టర్ వై. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ బోనగిరి అనిల్ గుప్తాలను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రోటరీ వ్యవస్థాపకుడు మాలె నాగేశ్వరరావు, జిల్లా నాయకులు వద్దుల సురేందర్ రెడ్డి, కార్యదర్శి శంతన్ రామరాజు, కోశాధికారి ముల్లంగి మోహన్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ తోర్నాల నగేష్, సీనియర్ రొటేరియన్లు వేమిశెట్టి కిషోర్ కుమార్, గిరిధర్ గుప్తా, బొల్లం శ్రీనివాస్, కొడారి నాగేందర్, గూడూరు నాగేశ్వరరావు, లక్ష్మీనర్సింహారావు, సాధు మహిపాల్ రెడ్డి, జంగాల నర్సింహారావు, వల్లాల రమేష్, బోయినిపల్లి సతీష్ రావు, మాలె శ్రావణ్, అచ్చ శ్రీనివాస్, కట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!