రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
మహబూబాబాద్,జూలై 2 (చైతన్యగళం): రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు దూదికట్ల సత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడారు. మానవాళి మనుగడకు వైద్యుల సేవలు జీవనాధారం. అలాంటి మహనీయులను సత్కరించడం రోటరీకి గౌరవం” అని అన్నారు. రోటరీ క్లబ్ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, వికలాంగుల...