Friday, September 11, 2026
Homeతెలంగాణసేవాభావానికి గుర్తింపుగా ప్రశంసా పత్రం

సేవాభావానికి గుర్తింపుగా ప్రశంసా పత్రం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్య గళం):

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి వారి సేవలను గుర్తించారు.

ఈ క్రమంలో నాణ్యమైన, సమర్థవంతమైన సేవలను అందిస్తూ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన జిల్లా సంక్షేమ కార్యాలయంలోని మిషన్‌ వాత్సల్య ఉద్యోగి యం. రాజ్‌కుమార్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

సేవాభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలకు మార్గం సుగమమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల రాజ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!