Saturday, June 27, 2026
Homeఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీలు

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీలు

📰 Generate e-Paper Clip

మంత్రాలయం, జూన్ 25(చైతన్యగళం): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మంత్రాలయం మండలం, మాధవరం గ్రామానికి పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, రూట్ బందోబస్తు, సెక్టార్‌ల వారీగా నియమించిన ఇన్‌ఛార్జ్ అధికారుల విధులు, భద్రతా చర్యలపై నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ సమగ్రంగా వివరించారు.

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు సూచిస్తూ, “విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి, సమన్వయంతో పనిచేయాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, నంద్యాల స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!