ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీలు

మంత్రాలయం, జూన్ 25(చైతన్యగళం): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మంత్రాలయం మండలం, మాధవరం గ్రామానికి పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, రూట్ బందోబస్తు, సెక్టార్‌ల వారీగా నియమించిన ఇన్‌ఛార్జ్ అధికారుల విధులు, భద్రతా చర్యలపై నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ సమగ్రంగా వివరించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు...