Tuesday, June 23, 2026
Homeక్రైమ్ న్యూస్ఆర్టీసీ రిటైర్డ్ మెకానిక్ జక్కుల నాగరాజు కన్నుమూత

ఆర్టీసీ రిటైర్డ్ మెకానిక్ జక్కుల నాగరాజు కన్నుమూత

📰 Generate e-Paper Clip

నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్

షాద్‌నగర్, జూన్ 15 (చైతన్యగళం): రిటైర్డ్ ఆర్టీసీ మెకానిక్, బీసీ జనసేన జాతీయ నియోజకవర్గ అధ్యక్షురాలు జక్కుల జలజ భర్త జక్కుల నాగరాజు సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.నాగరాజు ఆర్టీసీలో మెకానిక్‌గా విధులు నిర్వహిస్తూ షాద్‌నగర్ డిపోలో ఎన్నో సంవత్సరాలు సేవలందించారు. విధి నిర్వహణలో నిబద్ధత, సహోద్యోగులతో సత్సంబంధాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. కొంతకాలం క్రితమే ఉద్యోగ విరమణ పొందారు.నాగరాజు పార్థివదేహాన్ని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్నేహితులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.బీసీ జనసేన నాయకురాలు జక్కుల జలజను పలువురు పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!