మంథని, జూలై 21 (చైతన్యగళం):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి సువర్ణ వనమాల (91) బుధవారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. “దివంగత సువర్ణ వనమాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని మంత్రి పేర్కొన్నారు.అంతిమయాత్రలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
