మంథని మాజీ సర్పంచ్ సువర్ణ వనమాల అంతిమయాత్రలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
మంథని, జూలై 21 (చైతన్యగళం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి సువర్ణ వనమాల (91) బుధవారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ...