Saturday, September 5, 2026
Homeతెలంగాణకరీంనగర్ జిల్లా బీజేపీ నూతన సారధికి ఘన సన్మానం

కరీంనగర్ జిల్లా బీజేపీ నూతన సారధికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కరీంనగర్ రూరల్, ఆగస్టు 13 (చైతన్యగళం):

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సాయిని మల్లేశంకు 6వ డివిజన్ బొమ్మకల్ నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.

జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ, “బొమ్మకల్ నాయకులు, కార్యకర్తలతో నాకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. రేపు జరగబోయే తిరంగా ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బూత్ కమిటీలను బలోపేతం చేసి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యుడు పాశం తిరుపతి, దళిత మోర్చా జిల్లా నాయకులు గాలిపల్లి నారాయణ, పుట్టపాక శ్రీధర్, పెద్ది లక్ష్మణ్, మెరుగవేణి శ్రీకాంత్, బుచన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!