Friday, September 4, 2026
Homeతెలంగాణకరీంనగర్90 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్‌కు జాతీయ జెండా బహుకరణ

90 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్‌కు జాతీయ జెండా బహుకరణ

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 13 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమానికి స్పందిస్తూ కరీంనగర్‌కు చెందిన ఉప్పల రామేశం ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వయోశ్రేష్ఠులను సత్కరిస్తున్నారు. 2022లో 75 ఏళ్లకు పైబడిన 75 మంది సీనియర్‌ సిటిజన్లకు, 2023లో 76 మందికి, 2024లో 77 మందికి, 2025లో 50 మందికి జాతీయ పతాకాలను బహుకరించి సత్కరించిన రామేశం.. ఈ ఏడాది 90 ఏళ్లకు పైబడిన వయోశ్రేష్ఠులను గౌరవిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన సత్యసాయి భక్తుడు, సేవకుడు, విశ్రాంత ఉద్యోగి వొజ్జుల నాగయ్య (95)కు జాతీయ పతాకాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల రామేశంతో పాటు మంచికట్ల లక్ష్మీపతి పాల్గొన్నారు. దేశభక్తి, వయోశ్రేష్ఠుల పట్ల గౌరవం, సమాజ సేవ వంటి విలువలను ప్రతిబింబించేలా ఉప్పల రామేశం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!