Tuesday, July 21, 2026
Homeఎడిటోరియల్మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణలు ఎంతో దోహదం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణలు ఎంతో దోహదం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

📰 Generate e-Paper Clip

  • కేటీఆర్ జన్మదినం కానుకగా ” గిఫ్టీ ఏ స్మైల్ ” కార్యక్రమంలో భాగంగా 500 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ
  • రానున్న రోజుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు విస్తృతంగా నిర్వహిస్తాం – టీ ఎం ఎస్ ఎన్జీవో ఫౌండర్ దొనికెన పద్మ

హైదరాబాద్, జులై 20, : మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణలు ఎంతో కీలకమని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సంఘం ఫౌండర్ (ఎన్ జీ ఓ) అధ్యక్షురాలు దొనికెన పద్మ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు శ్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరై వివిధ రంగాలలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళల సాధికారత కోసం విస్తృతంగా కృషి చేస్తున్న మహిళా సంఘం ఫౌండర్ (ఎన్ జీ ఓ) అధ్యక్షురాలు దొనికెన పద్మ ను అభినందించి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆధునిక కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కుటుంబ ఆర్థికాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి కూడా మహిళలు కీలకంగా నిలుస్తారని ఆమె పేర్కొన్నారు.

మహిళలకు అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా మహిళల సాధికారత కోసం ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆమె సూచించారు.


శిక్షణ పొందిన ప్రతి మహిళ తన ప్రతిభను నిరూపించుకుని కుటుంబానికి అండగా నిలవాలని, సమాజంలో ఆదర్శంగా ఎదగాలని సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం అధ్యక్షురాలు దొనికేన పద్మ మాట్లాడుతూ పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద గల సేయింట్ మేరీ గ్రామర్ హైస్కూల్ లో 45 రోజులు మహిళలకు కుట్టు మిషన్, కంప్యూటర్, బ్యూటీషలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విలియమ్ జేమ్స్ ను ఘనంగా సన్మానం చేశారు.గాడిలా శ్రీకాంత్ గౌడ్,
తుల ఉమా,మున్సిపాలిటీ ఛైర్మెన్, టిఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • ప్రతి మహిళ సమాజంలో ఆర్థికంగా, ఆదర్శంగా ఎదగాలి
  • రానున్న రోజుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు విస్తృతంగా నిర్వహిస్తాం – టీఎంఎస్ ఎన్జీవో ఫౌండర్ దొనికెన పద్మ

మహిళలు ప్రతి రంగంలో ఆర్థికంగా స్వావలంబన సాధించి, సమాజంలో ఆదర్శంగా ఎదగాలని ఎన్జీవో ఫౌండర్ దొనికెన పద్మ అన్నారు. మహిళల సాధికారతకు నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని పేర్కొంటూ, ఉపాధి అవకాశాలను కల్పించే శిక్షణ కార్యక్రమాలు వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తాయని తెలిపారు.
రానున్న రోజుల్లో మరింత మంది మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. శిక్షణతో పాటు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.
స్వయం ఉపాధి ద్వారా మహిళలు కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ పురోగతిలోనూ కీలక పాత్ర పోషించాలని దొనికెన పద్మ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!