Sunday, July 19, 2026
Homeతెలంగాణకరీంనగర్పలు డివిజనలొ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్

పలు డివిజనలొ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ జూలై 18 ( చైతన్య గళం):
హిందుత్వ నినాదాలున్న ఆటోను స్వయంగా నడుపుకుంటూ కరీంనగర్ లో తిరిగిన కేంద్ర మంత్రిజ్యోతినగర్ నుండి మంకమ్మతోట, గీతాభవన్, బస్టాండ్, బోయవాడ మీదుగా లక్ష్మీనగర్ దాకా వెళ్లిన బండి సంజయ్ లక్ష్మీనగర్ లో భరత్ కు పాత ఆటో స్థానంలో కొత్త ఆటోను అందజేసిన కేంద్ర మంత్రి
హిందుత్వ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నందుకు గర్వంగా ఉందన్న బండి సంజయ్
భరత్ కు పూర్తిగా అండగా ఉంటానని చెప్పిన కేంద్ర మంత్రిలక్ష్మీనగర్ లో రూ.50 లక్షలతో అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆటోవాలాగా మారారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో తన ఇంటి నుండి స్వయంగా ఆటోను నడుపుకుంటూ బయలుదేరారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్యాసింజర్ సీట్లో కూర్చోగా, పక్కనే హిందుత్వ నినాదాలను ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ భరత్ ను పక్కనే కూర్చోపెట్టుకుని జ్యోతి నగర్, మంకమ్మ తోట, గీతాభవన్ చౌరస్తా, ప్రతిమ చౌరస్తా, బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బోయవాడ మీదుగా లక్ష్మీనగర్ దాకా ఆటో నడిపారు. వివరాల్లోకి వెళితేవనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్(24) తన ఆటో వెనుక కవర్ పై ‘‘చాంగింగ్ యువర్ రిలీజియన్ ఐస్ లైక్ యువర్ ఫాదర్ నీ మతాన్ని మార్చుకోవడం అంటే నీ తండ్రిని మార్చుకోవడం లాంటిది అన్యొనె బోర్న్ ఆన్ ఠిస్ ఎర్త్ ఐస్ ఏ హిందూఐ శ్రీరామ్ ఈ భూమిపై పుట్టినప్రతిఒక్కరూహిందువులే… జై శ్రీరామ్ అని నినాదాన్ని రాయించుకున్నారు. ఈనెల 13న భరత్ ప్యాసింజర్ ను ఎక్కించుకుని మెహిదీపట్నం నుండి జీడిమెట్లకువెళుతుండగా మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు యువకులుఆటోనువెంబడించారుఆటో వెనుక ఏం రాసినవ్ రా ఏమనుకుంటున్నవ్ రా.ఆ స్లోగన్స్ తీసేస్తావా? లేదా?’ అంటూ బండ బూతులు ఆటో కవర్ వెనుకనున్న నినాదాలను గీకేశారు. ఆటో కవర్ ను చించి వేశారు. కొద్దిసేపటి తరువాత అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాసులు ఫోన్ చేసి ‘ఆటోమీద అట్లాంటి స్లోగన్స్ ఎట్లా రాస్తావ్? హైదరాబాద్ లో ఆటో తిరగాలని ఉందా? లేదా? వెంటనే స్టేషన్ కు రా. నీమీద కంప్లయింట్ వచ్చింది. రాకపోతే నీ ఆటోను సీజ్ చేస్తా’’అంటూ బెదిరించారు.
దీంతో భరత్ స్థానిక బీజేపీ నేతలను వెంట బెట్టుకుని రెండ్రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. ఫోటోలు, వీడియోలు చూపించారు. వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘బాధపడొద్దు. నేను అండగా ఉంటా’’అని భరోసా ఇవ్వడమే కాకుండా హిందుత్వ సిద్దాంతాన్ని నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నందుకు అభినందించారు. పాత ఆటో స్థానంలో కొత్త ఆటో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఈరోజు భరత్ ను పిలిపించి కొత్త ఆటో ఇవ్వడంతోపాటు హిందుత్వ నినాదాలతోనున్న పాత ఆటోను స్వయంగా నడుపుకుంటూ దాదాపు 5 కి.మీలు వరకు వెళ్లడం విశేషం. మరోవైపు కరీంనగర్ లోని 38వ డివిజన్ లోని లక్ష్మీనగర్ లో రూ.70 లక్షల విలువైన యూఐడీఎఫ్ నిధుల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 3వ డివిజన్ లోని విద్యారణ్యపురి బతుకమ్మ సర్కిల్ వద్ద రూ.48.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతోపాటు పలువురు బీజేపీ నేతలతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!