Friday, July 17, 2026
Homeతెలంగాణనీట్-2026 పేపర్ లీకేజీ – మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం

నీట్-2026 పేపర్ లీకేజీ – మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం

📰 Generate e-Paper Clip

  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.
  • ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం .

 

దేవరకొండ జూలై 14(చైతన్యగళం): దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలను మోస్తున్న నీట్-2026 పరీక్ష మరోసారి అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా – అధికార యంత్రాంగం కుమ్మక్కు కారణంగా విద్యార్థుల శాపంగా మారిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ లోకోదాడ&జడ్చర్ల జాతీయ రహదారి పై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ నీట్-2026 పరీక్షలో పేపర్ లీకేజీ, భారీ అక్రమాలు వెలుగులోకి రావడం మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు అంధకారంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో జరిగిన పేపర్ లీక్ ఘటనపై అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు ఇంత పెద్ద స్కాండల్ పునరావృతమైందని,పరీక్షా వ్యవస్థను కేంద్రం కోచింగ్ మాఫియాకు,కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు.ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని,విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ)ను రద్దు చేయాలని లేదా పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. నీట్-2026 పరీక్షను వెంటనే రద్దు చేసి, ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని కోరారు. లీకేజీకి కారణమైన అధికారులు, మధ్యవర్తులు, కోచింగ్ మాఫియాను వెంటనే అరెస్ట్ చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు మానసిక, ఆర్థిక పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా, రాష్ట్రాలకు తమ స్వంత ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హక్కును కల్పించాలని, విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.
కాక్రోక్ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం శానిటేషన్ పనులను నిలిపివేసి, వాటరు, కరెంటు సౌకర్యాలు లేకుండా, కనీసం నిరసన కోసం వేసుకున్న టెంట్లను ప్రయోగిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న నాయకుల పాడవుతున్న కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని, వెంటనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు.పరీక్షల రద్దుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్.జైరాం, సబావత్ వినోద్,ఎం.నాగరాజు,కే. మహేష్,ఏ.శివ.ఎల్.అశోక్, భరత్,కార్తీక్,అభిషేక్,గోపి, జయంత్,గోవిందా రాజ్,శ్రీధర్, ప్రవీణ్, సందీప్, సాయిరాం,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!