Thursday, July 16, 2026
Homeతెలంగాణడిండి ఎబివిపి ఆధ్వర్యంలో కళాశాల బంద్ విజయవంతం

డిండి ఎబివిపి ఆధ్వర్యంలో కళాశాల బంద్ విజయవంతం

📰 Generate e-Paper Clip

దేవరకొండ, జూలై 14 (చైతన్యగళం): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిండి మండలంలో ఎబివిపి శాఖ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతంగా జరిగింది. విద్యార్థుల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎబివిపి నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎబివిపి డిండి శాఖ నాయకుడు బాధమోని సాయి గౌడ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఈ పథకాన్ని నిర్లక్ష్యంగా అమలు చేస్తోంది. రూ.11 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో యశ్వంత్, చందు, సాయి గౌడ్, అంజి, అభిలాష్, పాసివ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!