నీట్-2026 పేపర్ లీకేజీ – మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం . దేవరకొండ జూలై 14(చైతన్యగళం): దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలను మోస్తున్న నీట్-2026 పరీక్ష మరోసారి అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా – అధికార యంత్రాంగం కుమ్మక్కు కారణంగా విద్యార్థుల శాపంగా మారిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ,...