Thursday, July 16, 2026
Homeతెలంగాణపది టాపర్లకు నగదు అందజేత

పది టాపర్లకు నగదు అందజేత

📰 Generate e-Paper Clip

ఎలిగేడు, జూలై 14 (చైతన్యగళం): ఎలిగేడు మండలంలోని ధూళికట్ట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి బుద్దినేని సత్యనారాయణరావు ప్రతి యేటా పది టాపర్లకు నగదు బహుమతులు అందజేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షల్లో ఎర్ర నందిని 513 మార్కులతో ప్రథమ స్థానం, భూసారపు శ్రీకృష్ణమల్లా గౌడ్ 507, కంది వరుణ్ సాయి 507 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. మొదటి స్థానం పొందిన విద్యార్థినికి రూ.2,000, రెండవ స్థానం పొందిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నగదు అందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్ కొమురయ్య, హెచ్‌ఎం బిజిలి సదయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!