Thursday, July 16, 2026
Homeతెలంగాణదివ్యంగుడి పిల్లలకు నోట్‌బుక్స్ అందజేత

దివ్యంగుడి పిల్లలకు నోట్‌బుక్స్ అందజేత

📰 Generate e-Paper Clip

జవహర్ నగర్, జూలై 14 (చైతన్యగళం):
దమ్మాయిగూడ జవహర్ నగర్‌కు చెందిన దివ్యంగుడు టి.వి. శ్రీనివాస్ ఇటీవల అకాల మరణం చెందాడు. ఆయన భార్య కూడా మూగ–చెవిటి దివ్యంగురాలు కావడంతో, కుటుంబం ప్రభుత్వంచే లభించే రూ.4,000 పింఛన్‌తోనే జీవనం సాగించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు పిల్లలు చదువును కొనసాగించలేక ఇంటివద్దనే ఉండిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్, ప్రముఖ సామాజిక సేవకుడు నాగ మోహన్ గారికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నాగ మోహన్ గారు, ఇద్దరు పిల్లలకు సరిపడా నోట్‌బుక్స్, బ్యాగులను గుత్తికొండ కిరణ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా టి.వి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నాగ మోహన్ గారికి, గుత్తికొండ కిరణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!