Friday, July 10, 2026
Homeతెలంగాణహైదరాబాద్పేదవారి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-ఎమ్మెల్యే శ్రీగణేష్

పేదవారి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-ఎమ్మెల్యే శ్రీగణేష్

📰 Generate e-Paper Clip

కంటోన్మెంట్, జూలై 10 (చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ అల్పాహార కార్యక్రమం శుక్రవారం రెజిమెంటల్ బజార్‌లోని మదర్ థెరిసా విగ్రహం వద్ద ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు కేవలం ₹5కే నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం పొందేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మదర్ థెరిసా చూపిన సేవామార్గంలో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!