మర్రిగూడ, జూలై 3 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని లెంకలపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రం నం.267లో ఎస్‌ఐఆర్ 2026 ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, బి.ఎల్.ఓ యాప్‌లో ఆన్‌లైన్ నమోదు విధానాన్ని చండూరు ఆర్డీవో శ్రీదేవి క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ, “ప్రతి ఇంటికి బి.ఎల్.ఓ ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారం ఓటర్లు నింపి తిరిగి ఇవ్వాలి. ఫారం ఇవ్వకపోతే ఓటర్ జాబితాలో పేరు ఉండదు. ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫారం నింపి సమర్పించాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, లెంకలపల్లి సర్పంచ్ అయితగోని పద్మ, ఉప సర్పంచ్, ఆర్‌ఐ, బి.ఎల్.ఓ పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
