Wednesday, July 8, 2026
Homeతెలంగాణజూలై 10 విద్యార్థి బంద్‌కు పిలుపు

జూలై 10 విద్యార్థి బంద్‌కు పిలుపు

📰 Generate e-Paper Clip

వెల్దండ, జూలై 3 (చైతన్యగళం): వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

నాయకులు మాట్లాడుతూ, “ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యార్థి బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!